వరుణ్ ధావన్(varun dhawan)కీర్తి సురేష్(keerthi suresh)జంటగా నటించిన చిత్రం బేబీ జాన్(baby john)క్రిస్ మస్ సందర్భంగా ఈ నెల 25 న వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న ఈ మూవీ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 2019 లో తమిళంలో జీవా హీరోగా వచ్చిన 'కీ' చిత్రానికి దర్శకత్వం వహించిన కలిస్(kalees)దర్శకుడు కాగా వామికా గబ్బి,జాకీష్రఫ్,రాజ్ పాల్ యాదవ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఇప్పుడు ఈ మూవీ నుంచి 'పీక్లీపోమ్' అనే సాంగ్ రిలీజయ్యింది.తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్న ఈ పాట ఇప్పుడు సినీ ప్రియులని ఎంతగానో అలరిస్తుంది. 'బేబీ నా జీవితం నీదే.. నీ కోసమే నా తపనంతా' అంటూ సాగుతున్న ఈ పాట రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది.
తమిళంలో అట్లీ దర్శకత్వంలో విజయ్(vijay)హీరోగా తెరకెక్కిన 'తేరి'(teri)కి అఫిషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న బేబీ జాన్ లో బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్(salman khan) పోలీస్ ఆఫీసర్ గా క్యామియో అప్పీయరెన్సు ఇవ్వనున్నాడు. తమన్(taman)కూడా ఒక సాంగ్ లో క్యామియో రోల్ లో కనిపిస్తున్నాడు.